రాధేశ్యామ్‌ రిలీజ్‌ తేది ఇదే..

రాధేశ్యామ్‌ రిలీజ్‌ తేది ఇదే..

బ్యాట్‌మెన్‌ విడుదలతో యూస్‌ కలెక్షన్లపై ఆందోళన

కరోనా మూడోవేవ్‌మెల్ల మెల్లగా కనుమరుగవుతోంది. పరిస్థితులు అన్ని చోట్లా చక్కబడుతుండటంతో సాధారణ వాతావరణం నెలకొననుంది. దీంతో వాయిదా పడిన భారీ బ్జడెట్‌సినిమాలు అన్నీ వరుసగా విడుదలను ఖరారు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ’ఆర్‌ఆర్‌ఆర్‌’ మార్చి 25న రిలీజ్‌అవుతుందని అధికారికంగా ప్రకటించగా ఈ రోజు ’రాధే శ్యామ్‌’ను కూడా మార్చి 11న విడుదల చేస్తామని మేకర్స్‌ఎనౌన్స్‌చేశారు. ఇదిలా ఉంటే డిసి కామిక్‌సూపర్‌హీరో ’బ్యాట్‌మేన్‌’ సినిమాను మార్చి 4న యుఎస్‌లో విడుదల చేయబోతున్నారు. నిజానికి గతేడాది మార్చిలో విడుదల కావలసిన ఈ సినిమా కూడా కరోనా పాండమిక్‌వల్ల వాయిదా పడిరది. యు.స్‌మార్కెట్‌లో మార్చి 4న భారీ స్థాయిలో విడుదల కాబోతోందన్నమాట. మన తెలుగు సినిమాలకు కూడా యుఎస్‌పెద్ద మార్కెట్‌. ఒక వేళ సూపర్‌హీరో ’బ్యాట్‌మేన్‌’కి మంచి రెస్పాన్స్‌లభిస్తే ఆ ప్రభావం హాలీవుడ్‌బాక్సాఫీస్‌వద్ద 11న రానున్న

’రాధేశ్యామ్‌’పై పడే అవకాశం ఉంది. మాట్‌రీవ్స్‌దర్శకత్వం వహించిన ’బ్యాట్‌మేన్‌’లో రాబర్ట్‌పాటిన్‌సన్‌, జెఫ్రీ రైట్‌, జో క్రావిటిజ్‌ముఖ్య పాత్రలను పోషించారు. మరి ’రాధేశ్యామ్‌’కి ’బ్యాట్‌మేన్‌’ దెబ్బ తగులుతుందా అన్నది చూడాలి. 

Newsletter